రాజకీయ పరిపక్వత లేని వాళ్లు పవన్ కల్యాణ్ లా మాట్లాడతారు: బొత్స విమర్శలు

  • రాజకీయాలంటే సినిమా డైలాగ్స్ చెప్పడం కాదు
  • పవన్ మాట్లాడిన ప్రతి మాటకు బాధ్యత వహించాలి
  • పవన్ మానసిక పరిస్థితి బాగో లేదు
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత బొత్స తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ పరిపక్వత లేని వాళ్లు పవన్ కల్యాణ్ లా మాట్లాడతారని, రాజకీయాలంటే సినిమా డైలాగ్స్ చెప్పడం కాదని అన్నారు.  పవన్ మానసిక పరిస్థితి బాగో లేదని, ఆయన ఎప్పడు, ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారో ఎవరికీ అర్థం కాదని, పవన్ మాట్లాడిన ప్రతి మాటకు బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా లగడపాటి రాజగోపాల్ పైనా ఆయన విమర్శలు చేశారు. బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన వ్యక్తి లగడపాటి అని, తెలంగాణలో సర్వే పేరిట ప్రజలను నట్టేట ముంచారని విమర్శించారు.  
Go Back to Shorts
Pawan Kalyan
botsa
janasena
ysrcp

More Telugu News